Sunday, August 26, 2007

మౌనగానం


నీవు లేనప్పుడు
నీపై పాటలతో
నా గదంతా పులకించిపోతుంది.

అదేం చిత్రమో!
నీవు ఎదుట నిలుచుని
నన్నో పాట పాడమంటే
నా గొంతు పెగలి రాదు.
కానీ
నా హృదయంలో
ఎన్నెన్ని వీణలు పాటలు పాడతాయనీ!

నీ హృదయం ఆ పాటలు వింటోందని
నిర్మల తటాకాల్లాంటి నీ కళ్ళు
నాతో చెబుతాయి.

2 comments:

విహారి(KBL) said...

కవితలు,బొమ్మలు,టైటిల్స్ బాగున్నాయి.మీ ప్రొఫైల్ కూడా తెలుగులో పెట్టండి.ఇంకా బాగుంటుంది.ధన్యవాదాలు.

భాను said...

విహారి గారూ,

ధన్యవాదాలండీ. మీ సూచన తప్పకుండా ఆచరిస్తాను, నిజానికి నేను బ్లాగు లోకానికి కొత్త.నా బ్లాగు create చేసి వారం కూడా కాలేదు.మెల్లమెల్లగా refine చేసుకుంటూ వస్తున్నాను. నా ప్రొఫైల్ కూడా తెలుగులో రాద్దామని మొదలు పెట్టా నిన్న.బహుశా రేపటికి పూర్తి చేస్తా.

భాను