ఏ
అనుభూతుల మంచు బిందువుల మాటునో
మత్తుగా కళ్ళు విప్పే
నా జ్ఞాపకాల గులాబీతోట
మెత్తగా
పుప్పొడిలా
సుతారంగా జారే
నీ పరీమళపు దరహసం
గుండె లోతుల్లో
ఉండుండి వినిపించే నీ పాట
నా కళ్ళ నుండి కన్నీరై ప్రవహిస్తుంది.
భానుమూర్తి(1979)
(ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం)
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
భావుకత్వానికి అసలయిన అర్ధం లా వుంది ఈ కవిత.
రాధిక గారూ,
ధన్యవాదాలు.మీలాంటి సహృదయులు,కవిత్వాన్ని అనుభవించి పలవరించే వారూ అభినందిస్తే ఒక తృప్తి.
భాను
Post a Comment