Saturday, August 18, 2007

జ్ఞాపకాలు

జ్ఞాపకాలు


జ్ఞాపకాలు మిగులుతాయి చివరికి

వసంతం వెళిపోతూ వెళిపోతూ
గుప్పెడు పూలు రాల్చి పోతుంది

పరిమళం మాత్రం మిగులుతుంది చివరికి

బాటలు చీలే చోట బరువెక్కిన గుండెలు మూలుగుతాయి
వీడ్కోలు కౌగిలిని విడిపించుకోలేక
వేళ్ళు ఉద్విగ్నంగా చలిస్తాయి
కలసి నడిచిన అడుగుల్ని తలచుకుని కళ్ళు రెండు సముద్రాలవుతాయి

కలలు మాత్రం మిగులుతాయి చివరికి

తీరాన్ని వదలి పడవ దూరదేశాలకు ప్రయాణమౌతుంది
గాలిలో కోలాహలం క్రమంగా దూరమౌతుంది
ఒడ్డునున్న ఇసుక మీద ఒంటరితనం దీనంగా నిలబడుతుంది

సముద్రపు హోరు మాత్రం మిగులుతుంది చివరికి

పచ్చని చెట్ల గుబుర్లలోంచి పక్షి ఎగిరిపోతుంది
పాట మాత్రం మిగులుతుంది చివరికి

జ్ఞాపకాలు మిగులుతాయి చివరికి



భానుమూర్తి (1984)

7 comments:

శ్రీనివాస said...

బ్లాగ్లోకానికి స్వాగతం :-)
కవిత బాగుంది.

Unknown said...

బ్లాగులోకానికి స్వాగతం

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది

www.jalleda.com

జల్లెడ

రాధిక said...

caalaa caalaa baagumdi.

కందర్ప కృష్ణ మోహన్ - said...

బాగున్నాయండీ.....

raj pavani said...
This comment has been removed by the author.
raj pavani said...

Deep feelings very well expressed in simple words. I will share with Telugu poetry lovers

Bolloju Baba said...

కలలు,జ్ఞాపకాలు పరిమళం,సముద్ర హోరు, ఇవన్నిటినీ
చక్కని మాటల మద్య అల్లుకుంటూ కవిత నిండా ఒక మెలంకలీ ఆరా "aura" ని నింపారు.
చాలా బాగుంది.

http://sahitheeyanam.blogspot.com/