రేయ్ భానూ,
అవ్యక్తపుటాలోచనలూ,అస్పష్టమైన కలలూ,అంతుపట్టని ఉద్రేకాలూ ఎక్కడికి నడిపిస్తాయి నిన్ను? ఎడతెగని,కడలేని నీ నిరంతర యాత్ర ఏ స్వప్న సీమా సౌందర్యం కోసం? నాకు తెలుసు, నీ హృదయం విచిత్ర విచిత్ర వర్ణాల ఊహల ఇంద్రధనుస్సులు చిత్రీకరించుకున్న ఆకాశం;కలల పువ్వులు నిండుగా విరబూసిన పూలతోట. నాకు తెలుసు - నీ హృదయం తీరని వాంఛలతో, అలౌకికమైన కాంక్షలతో తెలియని తీరాలనుంచి వినవచ్చే ఏ పిలుపులకో చలించి,గాలి తాకిడికే ఉలిక్కి పడే,ఊగిసలాడే ఒక రసజ్వాల. ఒక ఉన్మత్త సముద్రం.
నిదురలో నవ్వే పసిపాప పెదవులపై తొణికిసలాడే అమాయకత్వాన్ని నువ్వు ప్రేమిస్తావు. మంచు తుంపరల వెనక మెల్లగా కళ్ళు విప్పే మల్లె పూలని నువ్వు ప్రేమిస్తావు.ఇంద్రియానందాన్నధిగమించి అతీతమైన దైవత్వాన్ని అందుకునే దేహసౌందర్యాన్ని నువ్వు ఆరాధిస్తావు. అర్ధరాత్రి ఆకాశంలో నక్షత్రాలు మాట్లాడుకునే రహస్యాల్ని నువ్వు శోధిస్తావు.జీవితాన్ని నువ్వు దోసిళ్లతో అమృతధారలాగా ఆస్వాదిస్తావు. మరి దేని కోసం వెర్రిగా వెతుకుతావు?
అవును.నేనర్థం చేసుకోగలను.స్వర్గసీమా ప్రాంగణంలోనుంచీ తేలి వచ్చే అప్సరల అమరగానం కోసం ప్రతి గొంతు వైపూ ఆశగా చూస్తావు. హాయిగా పుష్పించే చిరునవ్వుల కోసం ప్రతి పెదవి వైపూ ఆశగా చూస్తావు. చల్లగా,నిండుగా పలకరించె దయామయ దృష్టుల కోసం ప్రతి కంటినీ దీనంగా పరిశీలిస్తావు. మెత్తగా,తల్లిలా లాలించే వొడి కోసం ప్రతి చేతుల్నీ అభ్యర్థిస్తావు. నాకు తెలుసు.నువ్వు ప్రేమిస్తావు. నీ హృదయాన్ని లోకం ముందు హాయిగా విసిరేస్తావు. నిజంగా నువ్వు ప్రేమిస్తావు.
నువ్వు దేవున్ని ప్రేమిస్తావు.శిలువ పై జీసస్ స్రవించిన రక్తాన్ని తలచుకుని నీ కళ్లు రెండు సముద్రాలవుతాయి. నీ హృదయం ఒక వర్షామేఘమే అవుతుంది. కైలాస శిఖరాగ్రాన తాండవించే నటరాజును తలచుకుని నీ శరీరం పులకించిపోతుంది. నీ గుండె పొంగే సముద్రమే అవుతుంది. ప్రచండ ఝంఝానిలమే అవుతుంది.అపార కరుణామయుడయిన అల్లాను తలచుకుని నీ హృదయం కృతజ్ఞతతో చేతులు జోడిస్తుంది.నీ శిరస్సు అవనతమవుతుంది. అవును, నువ్వు దేవున్ని ప్రేమిస్తావు.మసీదును ప్రేమిస్తావు.మందిరాన్ని ప్రేమిస్తావు.చర్చిని ప్రేమిస్తావు.అవును, నువ్వు మనుషుల్ని ప్రేమిస్తావు.
ఒరేయ్ వెధవా ___ నిజంగా చెబుతున్నాను. ఈ లోకం ద్వారా నిన్ను నువ్వు ప్రేమిస్తావు.
భాను(1990)
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
చాలా బావుంది భాను గారూ.
ఇలాంటి గుండె గోడునే మా రాకేశ్వరుడు (of andam.blogspot.com fame) హృదయభాను అంటుంటాడు. :-)
రెణ్ణెల్లు సెలవ తీసుకున్నారు .. కొత్తవి వెయ్యాలి మరి !
చాలా బావుంది భాను గారు..!
మీ లేఖలోని ప్రతి వాక్యం మన జీవితాల్లో అలుముకుంటున్న యాంత్రికతని ప్రశ్నిస్తున్నట్లుంది
Good one..
నమస్తే భానుగారు.మూడు ,నాలుగు నెలల క్రితం ఆత్మబంధం మూవీలో "ఊరుకొ ఊరుకొ" అనే పాట అడిగారు కదా. అది ఇన్నాళ్ళకు దొరికింది.ఈ రొజే పోస్ట్ చెసాను.విని,చదివి ఆనందించండి.ధన్యవాదాలు.
చాలా బాగుంది.
గుండెలోతుల్లోకి తొంగిచూసుకుంటేనే ఇలాంటి కవిత్వం వెలువడుతుంది. సబ్టిల్ ఫీలింగ్స్ ని గ్లోరిఫై చెయ్యగలిగేదే మంచి కవిత్వం, అదే ఈ కవితలో కనిపించింది.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
HI ,
Increase your revenue 100% of your blog by converting into free website.
Convert your blog "yourname.blogspot.com" to www.yourname.com completely free.
Become proud owner of the (.com) own site .
we provide you free website+ free web hosting + list of your choice of
scripts like(blog scripts,CMS scripts, forums scripts and many scripts)
all the above services are absolutely free.
You can also start earning money from your blog by referring your friends.
Please visit www.hyperwebenable.com for more info.
regards
www.hyperwebenable.com
మీ కవిత్వం చాలా క్రియేటివ్ గా వుండి భాను గారు.... మంచి ప్రయత్నం .....మీ కలం నుంచి ఇంకా మంచి ఆణిముత్యాలు రావాలని ఆశిస్తూ...
చాలా మనస్ఫూర్తిగా ఉంది. ఒక అందమైన ఆత్మావలోకనం...
Post a Comment