Friday, September 14, 2007

నీటి నీడ


నువ్వు నాకెప్పటికీ ఒక స్వప్నమే

అసహాయంగా రాలిపడే అక్షరాల మధ్య
నువ్వింకా అవ్యక్తమే

గాలి కౌగిలింతలే తప్ప ఎట్లా నిన్ను స్పృశించేది

నువ్వెప్పటికీ ఒక నైరూప్య సౌందర్యమే

గింజుకునీ కలవరపడీ తపించీ
నన్ను నేను దగ్ధం చేసుకునీ
నన్ను నేను ధ్వంసం చేసుకునీ

ఎప్పటికీ ప్రసారం చేయబడని కాంతి అనుభవమే

2 comments:

బుసాని పృథ్వీరాజు వర్మ said...

అబ్బ, నిజంగా ఎంతబావుదండీ.
పదాలు కావవి మీ ఎదసవ్వడులు.
‘కవిత్వం’ లో కమనీయ రూపాలు.
సంగ్దిగ్దం లో సవరించుకున్న స్వరూపాలు.
మనసు మనిషిని చేరుకుంటుంన్నది.
మీ కలం కవిత్వంతో నా హృదయాన్ని చేరుకుంటుంన్నది.
మీ ‘నీటినీడ’ గాలి కెరటమై మనసు పడవను చేరుకోవాలి.

చాలా బాగున్నదండీ.

మురారి said...

>>ఎప్పటికీ ప్రసారం చేయబడని కాంతి అనుభవమే.
very nice one.