నీతో ఓ వెన్నెల రాత్రి
జవరాల!
లలిత లలితమ్మయిన నీ నవ్వు
తొలి మంచు తెర వెనక
తెలి మల్లె పువు రేకలను విచ్చినటు
తరగలై వెన్నెలలు భువి కప్పినటు
బరువు బరువుగ గాలి
పరిమళము మోసికొని
నిండు చూలాలు నిట్టూర్చినటు
ఈ రేయి వెన్నెల కన్నె
బరువు గాలికి పైట జార్చినటు
చెంత చేరిన ప్రియుడు
మంద మలయానిలము
సెలకన్నె చెక్కిలిని మీటినటు
గలగలల సెలకన్నె పులకించి
చెలునితో గుసగుసలు పలికినటు
వలపు నవ్వులు నవ్వు చెలియ!
నీ అంగుళుల
స్పృశియించి పులకించు
ఇసుక రేణువు కాగ
నా ఎడదనొక తలపు!
(1984)
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
నానోలు కోసం చూడండి బ్లాగూ;
nanolu.blogspot.com
చిన్న కొనసాగింపు సారూ,
మన్నించాలి. సరదాగా.....
పోటీలు, పోలికలూ, పధకాలు, పన్నాగాల వలల్లో
ఇంకా చిక్కుకోని ఆ అకలుషిత దినాల్లో
పట్టుకుచ్చులతో స్పృశించే నారింజ కాంతుల రాత్రిలో
వాంఛ, అంగీకారం పెనవేసుకొన్న క్షణాన
నీ కురులమల్లియలను కాల్చేలా నా శ్వాస జ్వలించేవేళ
విచ్చుకొన్న పెదవులు, సగంమూసిన కనులతో
నీ సౌందర్యం శాటిన్ తెరై నా హృదయంపై పరచుకొన్నప్పుడు
ఒక అదృశ్య హస్తం నిన్నూ నన్నూ ఎత్తుకపోయి
కాలరహిత, ఆలోచనారహిత, చేతనారహిత స్థితిలో కప్పెట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
బాబా గారూ,
నా అకలుషితదినాల ఆ కవిత వల్ల మీ నుండి కొన్ని అద్భుతమయిన రసప్లావితమయిన పంక్తులను అందుకున్నందుకు ఆనందంగా ఉంది.
"నీ కురులమల్లియలను కాల్చేలా నా శ్వాస జ్వలించేవేళ
విచ్చుకొన్న పెదవులు, సగంమూసిన కనులతో
నీ సౌందర్యం శాటిన్ తెరై నా హృదయంపై పరచుకొన్నప్పుడు
ఒక అదృశ్య హస్తం నిన్నూ నన్నూ ఎత్తుకపోయి
కాలరహిత, ఆలోచనారహిత, చేతనారహిత స్థితిలో కప్పెట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది."
తిలక్ తొంగిచూస్తున్నాడు మీ కవితలో అందంగా! ఎదో ఒక కవిత బ్లాగ్ లో పెట్టి చాల కాలమయిందని ఎప్పుడో 1984 లో రాసిన ఈ కవిత కనిపిస్తే పోస్ట్ చేసా.నా కవిత కన్నా మీ కామెంట్ సూపర్బ్!
గురువుగారూ
నిజమేనండీ. ఈ కవిత తిలక్ స్టైల్ ని అనుకరించటానికి చేసిన ఒక ప్రయత్నం.
వీలు కుదిరినపుడు ఈ క్రింది లింకులో జరిగిన చర్చను చదవండి. అందులో ఈ కవితపై మంచి కామెంట్లు ఉన్నాయి. ఆశక్తికరంగా ఉంటుందనే భావిస్తాను.
http://www.aavakaaya.com/articleComments.aspx?articleId=1338
Guruvugaru...
Mee kavitwam lo tatvam ardham kavadaniki nenu inkoka janma ettalsi untundi..
Hats off guruvugaru...
teeyanaina badha chala baguntundata..
Mee venkata narayana
JNTU Hyd
guruji
please. EdO okaTi pOsT cheyaMDi.
mammalni maracipOtE elaa?
bollojubaba
ఆమె వీడుకోలుగా నవ్వింది
వెన్నెల చిలకరించినటు,
నా కనురెప్ప తడిసింది
ఆకసం ఏడ్చినటు
eppudu raasin ee vaakyalu ippudu mee valla gurtoccai.
Post a Comment